మారరు..వీరు మారరు..ఎన్ని వార్తలు వచ్చినా..ఎన్నిసార్లు ప్రత్యక్ష ప్రసారాలు చేసిన కొంతమంది  ప్రభుత్వ వైద్య సిబ్బంది అస్సలు మారరు.  విధుల నిర్వహనణలో నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తూనే ఉంటారు. తాజాగా నగరంలోని ఓ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నెగెటివ్‌ రక్తానికి బదులు ఓ పాజిటివ్‌ రక్తం ఎక్కించడంతో బాలింత మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.


రక్తం ఎక్కించే సమయంలో పొరపాటే ఇందుకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. శింగనమల మండలం ఆకులేడుకు చెందిన ఎం.సుకన్య(26)ను రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో చేర్చారు.  


ఈ నెల 19న ఆమెకు సిజేరియన్‌ చేయగా ఆడపిల్ల జన్మించింది. అదే రోజు ఓ–నెగిటివ్‌ రక్తం ఎక్కించారు. సుకన్యకు యూరిన్‌ రాకపోవడంతో వైద్యులు పరీక్షించి.. నెఫ్రాలజీ సేవలు అవసరమని కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు.  కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుకన్య మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వలనే సుకన్య మృతి చెందిందని బంధువులు అనంతపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: