బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  విచిత్రమైన ప్రకనట చేశారు. ఓడిపోయిన తెలుగుదేశంపార్టీకి అధికారంలోకి వచ్చిన వైసిపికి తేడా ఏమీ కనబడటం లేదన్నారు.  టిడిపి హయాంలో  జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యమేలితే తొందరలో వైసిపి గ్రామ వాలంటీర్ల రాజ్యం మొదలవ్వబోతోందట.

 

మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించటంలోను, విమర్శించటంలో చంద్రబాబునాయుడుతో పోటీ పడుతున్నట్లే కనబడుతోంది కన్నా వ్యవహారం. ఐదేళ్ళ చంద్రబాబు పాలనకు 50 రోజుల జగన్ పాలనకు తేడా ఏమీ లేదని చెప్పటమే కన్నా అవివేకానికి నిదర్శనంగా నిలిచింది.

 

చంద్రబాబు అండ్ కో లాగ కన్నా కూడా జగన్ పాలనను విమర్శించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనబడుతోంది. జగన్ పై చంద్రబాబు కసి పెంచుకున్నారంటే అర్ధముంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపిని ఘోరంగా ఓడించారు కాబట్టే జగన్ అంటే చంద్రబాబుకు మంటగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ బిజెపి పరిస్ధితి అలా కాదే. కమలం పార్టీ పెట్టుకున్నదే గోచి. దాన్ని జగన్ ఊడబీకిందేముంది ? బిజెపికి వచ్చిన ఓట్ల శాతం 0.84 శాతమంటేనే తెలిసిపోతోంది జనాలు ఏ స్ధాయిలో పార్టీని ఛీ కొట్టింది.

 

జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తే జనాలు భవిష్యత్తులో పట్టం కడతారని కన్నా భ్రమల్లో ఉన్నారేమో అనిపిస్తోంది. అలా అనుకుని ఐదేళ్ళు గడిపేసిన చంద్రబాబుకు జనాలు ఏ విధంగా బుద్ధి చెప్పారో కన్నా గమనించినట్లు లేదు. కాబట్టి జగన్ పై విమర్శలు, ఆరోపణలు మానుకుని కేంద్రం నుండి రావాల్సిన ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలపై దృష్టి పెడితే బాగుంటుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: