రాజకీయాల్లో రాణించాలంటే.. పొలిటికల్ టాలెంట్ తో పాటు వాయిస్ బాగా ఉండాలి. సరైన వాయిస్ లేకపోతే.. ఎంత కంటెంట్ ఉన్నా అది జనంలోకి బాగా వెళ్లదు. వైసీపీలో అలా మంచి వాయిస్ ఉన్న లీడర్లలో రోజా ఒకరు.


అయితే ఎన్నికల ముందు బలంగా వినిపించిన రోజా వాయిస్ ఎందుకో.. ఎన్నికల తర్వాత అంతగా వినిపించడం లేదు. సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆమెలో అంత హుషారు కనిపించడం లేదు. అసెంబ్లీలోనూ ఆమె ఎక్కువగా స్పందించడం లేదు.


రోజా.. ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశాల్లో బాగా మాట్లాడేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ బాగా వినిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆమె మాట్లాడడటం అరుదుగా మారింది. రోజా ఇలా సైలంట్ అవ్వడం వెనుక జగన్ వైఖరి కూడా ఓ కారణంగా వినిపిస్తోంది.


అయితే రోజాకు ఓ మైనస్ పాయింట్ కూడా ఉంది. ఆమె కాస్త అతిగా మాట్లాడతారు. స్పందన కూడా ఓవర్ గా ఉంటుంది. ఈ కారణంతోనే జగన్ ఆమెను అసెంబ్లీలో ఎక్కువగా మాట్లాడవద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఆమె ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుందోనన్న అనుమానంతో వైసీపీ వ్యూహాత్మకంగా.. మాట్లాడేవారి జాబితాలో రోజాను చేర్చలేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: