కొన్నిరోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతున్న కర్ణాటక రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంటోంది. గవర్నర్ వర్సెస్ సీఎంగా నడిచిన రాజకీయం ఇప్పుడు ఇంకా పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. నిన్నటి వరకూ ఒక్కటిగా నడిచిన స్పీకర్, సీఎం మధ్య ఇప్పుడు బేధాభిప్రాయాలు కనిపిస్తున్నాయి.


నేడు బలపరీక్ష నేపథ్యంలో స్పీకర్ రమేష్ కుమార్ తో ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. బలపరీక్షకు మరో రోజు సమయం ఇవ్వాలని కుమారస్వామి కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు స్పీకర్ రమేశ్ కుమార్ ససేమిరా అంటున్నట్టు సమాచారం.


ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్ష పూర్తి చేస్తానని కుమార స్వామికి స్పీకర్ రమేష్ కుమార్ క్లారిటీగా చెప్పేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు, గవర్నర్ ఒత్తిళ్లు మేరకు ఇంకా తాను పొడిగించే రిస్క్ తీసకునేందుకు స్పీకర్ సుముఖంగా లేరు.


మరోవైపు.. స్పీకర్ తో బిజెపి ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు బలపరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే తాను సమయంతో సంబంధం లేకుండా ఇవాళ ఓటింగ్ నిర్వహిస్తానని వారికి స్పీకర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: