కర్నాటక అసెంబ్లీలో బల నిరూపణ విషయంలో సిఎం కుమారస్వామి ఆఖరు పోరాటం చేస్తున్నారు. ఈరోజు అంటే సోమవారం సాయంత్రం  6 గంటల్లోగా విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయించారు. అయితే విశ్వాస పరీక్షను మరో రెండు రోజులు వాయిదా వేయించేందుకు కుమారస్వామి చేసిన ప్రయత్నాలు కుదరలేదు.

 

ఇప్పటికే కర్నాటక రాజకీయం ట్విస్టుల మీద ట్వస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఎలాగైనా తన పదవిని కాపుడుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు చేసుకుంటుంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా వెంటనే పడగొట్టాలని బిజెపి అంతే స్ధాయిలో ప్రయత్నాలు చేస్తోంది.

 

 ప్రభుత్వాన్ని కాపుడుకోవాలని, అధికారంలోకి రావాలని రెండు వైపులా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్న నేపధ్యంలో స్పీకర్ రమేష్ నిర్ణయమే కీలకమైంది. రమేష్ కారణంగానే ఇప్పటికే రెండుసార్లు బలపరీక్ష వాయిదా పడింది. ఈ విషయమై చివరకు గవర్నర్ రాజూభాయ్ వాలా తో ఘర్షణ పడటానికి కూడా స్పీకర్ సిద్దపడ్డారు.

 

అంటే స్పీకర్ నిర్ణయం ఒక విధంగా కుమారస్వామికి కలిసివచ్చేదే. అయితే ఆ గడువును కుమారస్వామి సక్రమంగా ఉపయోగించుకునేందుకు అవకాశం కూడా రాలేదు. దాంతో మొత్తానికి ఈరోజు సాయంత్రం విశ్వాసపరీక్షకు కొత్తగా ట్విస్టులేవీ లేకపోతే ముహూర్తం కుదిరిందనే అనుకోవాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: