ఆంధ్ర ప్రదేశ్ కు నాలుగు రంగాల్లో నిధులు కేటాయిస్తామని ప్రపంచ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది .  ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, ప్రకృతి వైపరీత్యాలకు బిలియన్ డాలర్లు ఇస్తామని తెలిపింది. వాస్తవానికి రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించలేమని ప్రపంచ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది. రాజధాని నిర్మాణంపై కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో నిధులు ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంక్ వెనకడుగు వేసిందని తెలుస్తోంది . అయితే ఇంతలోనే మనసు మార్చుకుని , ఆంధ్ర ప్రదేశ్ కు వివిధ రంగాల్లో సాయం చేసేందుకు ముందుకొచ్చింది.


అమరావతి నిర్మాణానికి తొలుత వేల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంక్ అంతలోనే మనస్సు మార్చుకుని , తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది . ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వకపోవడానికి మీరంటే ... మీరే కారణమంటూ ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు . అమరావతి నిర్మాణం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న విధానాలు నచ్చకే వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు నిరాకరించిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.


 అయితే అమరావతి నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రపంచ బ్యాంక్ గుర్తించిందని , అందువల్లే ఇస్తామన్న రుణాన్ని ఇవ్వడం లేదని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు . అమరావతి ఒక స్కామ్ ల పుట్ట అని గ్రహించే గుర్తించే ప్రపంచ బ్యాంక్ ఇస్తామని చెప్పిన 3500 కోట్ల రుణాన్ని ఇవ్వకుండా నిలుపుదల చేసిందని ట్విట్టర్ వేదికగా అయన చెప్పుకొచ్చారు .


మరింత సమాచారం తెలుసుకోండి: