చంద్రయాన్ -2, భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతరిక్ష ప్రయోగం ఇది. ఈ అద్భుత ప్రయోగం దేశాన్ని సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఈ చంద్రయాన్ 2 ప్రయోగం వెనుక అనేక ఆసక్తికర కోణాలు దాగి ఉన్నాయి.


ఈ అద్భుత ప్రాజెక్టులో పాలుపంచుకున్న సైంటిస్టుల్లో 30 శాతం మంది మహిళలే కావడం వాటిలో ఒకటి. ఈ ‘చంద్రయాన్‌-2’ బృందంలో దాదాపు 30 శాతం మంది మహిళలే ఉన్నట్లు ‘ఇస్రో’ వర్గాలు తెలిపాయి. అందులోనూ కీలక బాధ్యతలనూ మహిళలు చేపట్టారు.


ఈ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎం.వనిత, మిషన్‌ డైరెక్టర్ గా రీతు కరిధాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చంద్రయాన్ కు సంబంధించిన అనేక ఇతర విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం చంద్రయాన్‌-2 ప్రయోగానికి అనువైన లాంచ్ విండో ఒక నిమిషమే కావడం విశేషం.


ఈ స్వల సమయంలోనే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేస్తామని ఇస్రో సైంటిస్టులు నమ్మకంగా చెబుతున్నారు. లాంచ్ విండో తక్కువగా ఉన్నా గత 20 ప్రయోగాలను అనుకున్న సమయానికే అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేసిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: