భువనగిరి -యాదాద్రి జిల్లాలోని హజీపూర్ లో ముగ్గురు అమాయక బాలికలపై  సైకో శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం జరిపి , హత్య చేసిన సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ , టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ గానీ .. మంత్రులు  పట్టించుకున్న పాపాన పోలేదు ఏ ఐ సీసీ కార్యదర్శి , మాజీ ఎంపీ హన్మంతరావు విమర్శించారు . అమాయకపు ఆడపిల్లలను  ఓ సైకో రేప్ చేసి చంపేస్తే ..  సర్కార్ స్పందన  నామమాత్రంగా ఉండడం దారుణమన్నారు .

 

కేసీఆర్ కు ధనికులు తప్పా .. పేదల బాధలు పాట్టించుకోవాలనే ఇంగితం లేదన్న అయన . ఇంతవరకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు . బాధిత కుటుంబాలను ఏ ఐ సీసీ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకా గాంధీ ని కలిపిస్తానని హన్మంతరావు చెప్పారు .

వారి బాధలను ఆమె  దృష్టి కి తీసుకెళతామని అన్నారు .

 

ప్రియాంకా అపాయింట్ మెంట్ కోసం లేఖ రాస్తున్నానని  ..హజీపూర్ గ్రామంలో సైకో శ్రీనివాస్ రెడ్డి  అమాయకపు ఆడపిల్లలను రేప్ చేసి చంపేస్తే  .. ఇంతవరకు ముఖ్యమంత్రి  పరామర్శించకపోవడం  దురదృష్టకరమని విమర్శించారు . సామాన్యులకు ఈ ప్రభుత్వం కల్పించే భరోసా ఇదేనా అంటూ ప్రశ్నించారు . రాష్ట్రం లో ఏ దుర్ఘటన జరిగిన  ముఖ్యమంత్రి స్పందించకపోవడం , పరామర్శించేందుకు వెళ్ళకపోవడం పట్ల విపక్షాలతో పాటు ప్రజాసంఘాలు తప్పుపడుతున్నాయి .

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: