కామాతురాణాం న భయం.. న లజ్జ అన్నారు.. ఇలాంటి కామ పిశాచులు అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను తమ కామవాంఛ తీర్చుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇద్దరు యువకులు.. సినిమా ఆశ చూపించి ఓ బాలికపై అత్యాచారం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని ఓ మురికివాడకు చెందిన పదకొండేళ్ల బాలిక ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. శనివారం హాస్టల్ నుంచి ఇంటికొచ్చింది. స్నేహితురాళ్లతో ఆడుకుంటున్న సమయంలో స్థానికులైన ఇస్లావత్ దస్రు, మోతీలాల్ అనే కుర్రాళ్లు ఆమెకు సినిమా చూపిస్తామని మాయమాటలు చెప్పారు.
నమ్మకం కలిగించేందుకు ఆమెతో పాటు మరో 8 ఏళ్ల బాలికను కూడా సినిమాకు తీసుకెళ్తామంటూ బండి ఎక్కించారు. సరూర్నగర్-గడ్డిఅన్నారం మార్గంలోని ఓ సినిమా థియేటర్లో సినిమా చూపిస్తామన్నారు. ఇంకా సినిమాకు సమయం ఉందని చెప్పిన దస్రు ఆ బాలికను ఓ నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు.
ఈ దృశ్యం చూసిన 8 ఏళ్ల బాలిక కేకలు వేయగా చుట్టుపక్కల జనం వచ్చారు. విషయం తెలుసుకుని ఇద్దరు యువకులను చితకబాది పోలీసులకు అప్పగించారు.