బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబునాయుడు వ్యతిరేకమా ?  ఈరోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే అందరిలలోను ఇదే అనుమానం మొదలైంది. మహిళలతో పాటు బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం అసెంబ్లీలో కొన్ని బిల్లులను వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బిల్లులను టిడిపి అడ్డుకుంది. ఆ బిల్లులు గనుక పాసయితే వైసిపికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళన టిడిపి సభ్యుల్లో స్పష్టంగా కనబడింది.

 

అసెంబ్లీలో వైసిపి కొన్ని చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టింది.  నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీలు, బిసిలు, ఎస్టీలు, ముస్లింలకు కేటాయించే బిల్లు మొదటిది. నామినేటెడ్ వర్కుల్లో 50 శాతం వెనుకబడిన వర్గాలకు అప్పగించాలన్నది రెండోది. పరిశ్రమల్లో 75 శాతం స్ధానికులకే ఉద్యోగాలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించే బిల్లులను ప్రవేశపెట్టింది అధికార పక్షం.

 

నిజానికి ఇటువంటి బిల్లులను గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదు. పాదయాత్ర సందర్భంగా జగన్ హామీల్లో భాగంగానే ఈ బిల్లులను అధికార పార్టీ సభ్యుల ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.  ఎప్పుడైతే అధికారపార్టీ బిల్లులను ప్రవేశపెట్టిందో వెంటనే టిడిపి అడ్డుకుంది. సభకు అంతరాయం కలిగిస్తు గోల మొదలుపెట్టింది. ఇందులో టిడిపి అడ్డుకోవాల్సినంత అభ్యంతరకరం కూడా బిల్లుల్లో ఏమీ లేదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం టిడిపి మద్దతిచ్చినా ఇవ్వకపోయినా సంఖ్యాబలం రీత్యా బిల్లులు ఎలాగూ పాసైపోతాయి. ఆ తర్వాత చట్టం కూడా అయిపోతుంది. ఈ మాత్రందానికి బిల్లులను అడ్డుకోవటం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. బిల్లులను అడ్డుకోవటం ద్వారా తాము బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, మహిళలకు వ్యతిరేకమని చంద్రబాబు చెప్పదలుచుకున్నారా ? అన్నదే అర్ధం కావటం లేదు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: