రాష్ట్రంలో 30 వేల  మంది రేషన్ డీలర్లు ఉన్నారని , వారిని తొలగించాలని ప్రతిపాదన  ప్రభుత్వానికి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి  నాని తెలిపారు . అసెంబ్లీ లో రేషన్ డీలర్ల తొలగింపు అంశంపై చర్చ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరి , రేషన్ డీలర్లను తొలిగిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు . రేషన్ డీలర్లను తొలగించమని ... వారిని  స్టాక్కిస్ట్ గా మారుస్తామని కొడాలినాని  చెప్పారు .


 గత ప్రభుత్వ హయాంలో  తన  నియోజకవర్గంలో నే 42 మంది డీలర్లను తొలగించి,  టీడీపీ నాయకులు వారి  అనుచరులను పెట్టారని అన్నారు . ఒరిజినల్ రేషన్ డీలర్లు ఎవర్ని తొలగించమన్న కొడాలినాని , దొంగ దారుల్లో వచ్చిన వారు లేచిపోతారని పరోక్షంగా టీడీపీ ప్రభుత్వ హయాం డీలర్ షిప్ దక్కించుకున్న వారిని తొలగిస్తామని చెప్పకనే చెప్పారు . టీడీపీ నేతలు డీలర్లను నుండి డబ్బులు వసూలు చేశారని , గతం ప్రభుత్వం హయం లో రేషన్ డీలర్ల పై కేసులు కూడా  పెట్టారన్నారు .


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపాధి కల్పిస్తారు తప్ప, ఎవర్ని డీలర్ గా  తొలగించే అవకాశం లేదని స్పష్టం చేశారు . వలంటీర్ల వ్యవస్థ అందుబాటు లోకి వచ్చాక , రేషన్ కార్డులను సమీక్షిస్తామని చెప్పారు . అర్హులైన వారికి త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్న ఆయన , రేషన్ డీలర్లు కార్డులు తమవద్దే పెట్టుకుని లబ్దిదారులకు సరకులు ఇవ్వకుండానే లెక్క చూపిస్తున్నారని అన్నారు . అటువంటి వారిపై దృష్టి సారించామని కొడాలి నాని హెచ్చరించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: