130 కోట్ల భారత ప్రజలు ‘జయహో భారత్’ అంటూ ఉద్వేగంతో పండుగ చేసుకుంటున్నారు. చందమామ చుట్టూ ఎన్నో కథలు మరెన్నో పాటలు ఆటలు. చిన్నప్పుడు ప్రతి వ్యక్తి ఎదో ఒక సందర్భంలో వెన్నెల కురిపించే చందమామను చూస్తూ కనీసం రెండు క్షణాలైన ప్రతి మనిషి గడిపే ఉంటాడు. చంద్రుడు మీద మానవుడు అడుగు పెట్టి 5 దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా చంద్రుడు గురించి ఇంకా పూర్తిగా ప్రపంచానికి తెలియదు. వాస్తవానికి చంద్రుడు మీద ఉంటే చాలు అక్కడ ఇళ్ళు కట్టుకుని వెళ్ళి పోవడానికి ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు అన్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పడే విషయం. 

భారతదేశాన్ని ఈ ప్రయోగంతో సూపర్ పవర్ గా మార్చి ‘చంద్రయాన్ – 2’ ఖర్చు కేవలం 978 కోట్లు మాత్రమే. ఇంత తక్కువ ఖర్చులో ఒక ఉపగ్రహాన్ని తయారు చేసి చంద్రుడు మీదకి పంపించే సాహసం చేయగల సత్తా ఒక్క భారతీయ శాస్త్రవేత్తలకు మాత్రమే ఉంది అని ఇస్రో రుజువు చేసింది. అంతేకాదు భారత శాస్త్రీయ విజ్ఞాన ఖ్యాతిని అమెరికా రష్యా ఫ్రాన్స్ ల తరువాత స్థానాన్ని ఆక్రమించి మన భారతీయ గొప్పతనాన్ని సూచిస్తోంది.
 
మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రయోగంలో పాల్గొన్న 30 శాతం మంది శాస్త్రవేత్తలు మహిళలు అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉండటమే కాకుండా భారతదేశ మహిళా శక్తిని సూచిస్తోంది. సరిగ్గా 2.43 నిముషాలకు చంద్రుడి వైపు దూసుకు పోతూ ఎగిరిన ఈ చద్రయాన్-2 చంద్రుడి పై దిగిన తరువాత మన భారతీయ పతాకాన్ని చంద్రుడి నేల పై పడేట్లు చేయడమే కాకుండా ప్రపంచంలోని అన్ని భాషలలోను రికార్డ్ చేయబడ్డ సందేశాన్ని అక్కడ జారవిడుస్తూ చంద్రుడి పై ఎవరైనా ఉంటే వారితో స్నేహం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది అంటూ 130 కోట్ల భారతీయుల తరఫున చంద్రయాన్ – 2 తెలియచేయబోతోంది. 

640 టన్నుల బరువు 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌-2 కంపోజిట్‌ మాడ్యూల్‌తో ఈ రాకెట్‌ పయనిస్తుంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చంద్రయాన్‌-2 మాడ్యూల్‌ను రోదసిలో వదిలి పెడుతుంది. ఇలా భూమికి 170.06 కి.మీ. దగ్గరగా, 39.120 కి.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్‌ మాడ్యూల్‌ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన అధీనంలోకి తీసుకుంటుంది. చందమామ చెంతకు చేరేందుకు చంద్రయాన్‌-2 మాడ్యూల్‌కు 48 రోజులు పట్టనుంది.  ఈ 48వ రోజున అంటే సెప్టెంబరు 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగేందుకు ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోతుంది. జాబిల్లిపై దిగిన వెంటనే విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వస్తుంది. చంద్రుడి పై దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో 14 రోజులపాటు సంచరిస్తూ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతం అయినా ఈ చంద్రయాన్-2 చంద్రుడి పై దిగే ఆఖరి 15 నిముషాలు ఇస్రో శాస్త్రవేత్తలకు పరీక్ష సమయం. ఆ చివరి నిముషాలలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈ ప్రయోగం తన లక్ష్యం పూర్తి చేసుకోవాలని భారత ప్రజల ఆకాంక్ష. చంద్ర గర్భంలోని ఖనిజాల గురించి నీటి జాడల గురించి తెలుసుకోవడానికి మన అందరి తరఫునా వెళ్ళిన ఈ చంద్రయాన్- 2 ప్రయోగం విజయవంతం కావాలని భారత జాతి యావత్తు ఆకాంక్షిస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: