జగన్ సైతం తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బీజేపీ ముఖ్య నేతలు మొదలు టీడీపీ నేతలను ఆరోపణ చేస్తున్నారు. కేబినెట్ కూర్పు లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అందరి ప్రశంసలు అందుకుంది.


ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల్ లోనూ యాభై శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు  ఇస్తూ మంత్రి వర్గం ఆమోదించింది. అయితే జగన్ ఇప్పటి వరకూ నియమించిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం ఒకే వర్గానికి ప్రాధాన్యత దక్కింది.


అదే ఇప్పుడు ఈ తరహా ఆరోపణకు కారణమౌతోంది. జగన్ ముఖ్య మంత్రి అయిన తర్వాత ఏపీలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు కీలక పదవులు భర్తీ చేశారు వీటిలో ఎక్కువ గా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే అంశంపైనా ఆరోపణ చేశారు.


వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత గా విజయసాయిరెడ్డి, లోక్ సభ పక్ష నేత గా మిథున్ రెడ్డి, టీటిడి ఛైర్మన్ గా సుబ్బారెడ్డి, సీఎం సలహాదారుడు గా అజయ్ కల్లామ్, కార్యదర్శిగా ధనంజేయరెడ్డి, చీఫ్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి గా, విప్ గా చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసి చైర్మన్ గా రోజ, టీటీడీ స్పెషల్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి, ఉన్నత విద్యా మండలి  చైర్మన్ గా హేమచంద్రారెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ ఇన్ చార్జి వీసీగా ప్రసాద్రెడ్డి, ప్రజా సంబంధాల సలహాదారుడు గా సజ్జల రామకృష్టారెడ్డి,  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మధుసూదన్ రెడ్డి, ఐటీ సలహాదారులుగా దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి, జె విద్యా సాగర్ రెడ్డి, పెట్టుబడుల సలహాదారుడు గా కె రాజు శేఖర్ రెడ్డి, వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ గా నాగిరెడ్డి ఇలా ఒకే వర్గానికి చెందిన వారికి ఈ పదవులు దక్కిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వైసీపీల్లో తొలి నుండి రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎక్కువనీ పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే ఈ నియామకాల జరిగాయని వైసీపీ నేతలు చెప్తున్నారు.


జగన్ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: