ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మిరుద్యోగ సమస్య నిర్మూలనే లక్ష్యంగా  మరో నిర్ణయం తీసుకున్నారు.   పారిశ్రామిక ఉద్యోగాల్లో 75 శాతం స్థానిక యువత కే ఉద్యోగావకాశాలు కల్పించాలని  ఆయన ప్రతిపాదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా పారిశ్రామిక సంస్థల్లో  స్థానికులకు 75%  ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.


 దానిలో భాగంగానే పారిశ్రామిక  సంస్థల్లో  75 శాతం ఉద్యోగాలు కల్పించాలని ప్రతిపాదనను చట్టం రూపంలో తీసుకు వచ్చేందుకు  కసరత్తు చేస్తున్నారు.   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను  ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించగా , దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే   అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్నారు .   బిల్లు ఆమోదం పొందిన వెంటనే రానున్న మూడేళ్లలో ఈ కోటాను రాష్ట్రంలో  అమలు చేసేవిధంగా కృషి చేయాలని  జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు .  అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన పారిశ్రామిక సంస్థలు ఒప్పుకుంటాయా ?  లేదా అన్నది అనుమానాస్పదంగా మారింది .


 ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పలు కంపెనీలను బుజ్జగించేందుకు జగన్ ఇప్పటికే  పలువురు ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే 1.  33 లక్షల గ్రామీణ వాలంటీర్  ఉద్యోగాలను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి , ఇప్పుడు తాజాగా 75 శాతం పారిశ్రామిక కోటాను  అమలు చేయడం ద్వారా నిరుద్యోగులకు మరిన్ని  ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: