Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 12:29 pm IST

Menu &Sections

Search

బీజేపీ ఓపెన్ ఆఫర్లు బెంగాల్ వరకే పరిమితమా లేక దేశవ్యాప్తంగానా ?

బీజేపీ ఓపెన్ ఆఫర్లు బెంగాల్ వరకే పరిమితమా లేక దేశవ్యాప్తంగానా ?
బీజేపీ ఓపెన్ ఆఫర్లు బెంగాల్ వరకే పరిమితమా లేక దేశవ్యాప్తంగానా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 18స్థానాల్లో గెలిచి మంచి ఊపుమీదున్న కమలం పార్టీ, ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ముఖ్యంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఓపెన్ ఆఫర్లను ప్రకటిస్తుంది. రెండు కోట్ల నగదుతోపాటు పెట్రోల్ బంకుల ఆఫర్ తో తమ నాయకులను ప్రలోభాలకు గురిచేస్తోందని, వాటికి లొంగని నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా భయపెడుతోందని , స్వయానా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

లోకసభ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ,ఈవీఎంలు,సీఆర్పీఫ్ బలగాల సహకారంతో రాష్ట్రప్రజలను మోసంచేసి గెలిచిన బీజేపీ, రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్దతిలో జరిపిస్తే వారి బలమెంతో ఆ పార్టీ పెద్దలకు బహిర్గతం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా బీజేపీ మాత్రం మమత ఆరోపణలను ఖండిస్తూనే సంస్థాగతంగా బలపడేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అయితే ప్రలోభాల పర్వాన్ని బెంగాల్ వరకే పరిమితం చేయని బీజేపీ, దేశవ్యాప్తంగా "ఆపరేషన్ కమలం" ను ఇదివరకే ఆచరణలో ఉంచింది. మొన్న గోవా, నేడు కర్ణాటక.. ఇలా అన్ని బీజేపీ ప్రభుత్వేతర రాష్ట్రాల్లో తమ పార్టీని తిరుగులేని శక్తిగా అవతరింపజేయాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తుంది. కర్నాటకానికి నేడో రేపో తెరపడితే తమ తదుపరి లక్ష్యం హిందీ రాష్ట్రమైన "రాజస్థాన్" అని కొందరు బీజేపీ పెద్దలు బహిరంగానే వ్యాఖ్యానించారు.

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణల్లో సైతం తాము అనుసరించాల్సిన వ్యూహాలను ఇదివరకే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాజ్యసభలో కూడా తమ బలాన్ని పెంచుకొని "జమిలి ఎన్నికల" బిల్లును ఆమోదింపజేసుకోవాలని యోచిస్తున్న బీజేపీ ఆదిశగా పావులు కదుపుతోంది. తామ ప్రణాళికలన్నీ సఫలం అయితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ,దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది.


bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బందరు పోర్టుపై అతి త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్న జగన్..!
ఇక మిగిలింది అరెస్టే.. అదీ, ఏ క్షణంలోనైనా..
బిగ్‌బాస్ హౌస్‌లో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!
వామ్మో.. బంగారం! సామాన్యుడికి ఇక భారమే..
సాహో ని తలదన్నేలా ' సైరా' చేస్తుంది ఇదే..!
హాలీవుడ్ రేంజ్, టాలీవుడ్ కు ఉందా ..!
ఆ ఒక్క లేఖ‌తో టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం..!
ప‌వ‌న్ క‌ళ్యాణ్ విలీన మంత్రం.. అస‌లు ర‌హ‌స్యం ఇదే..!
అతి త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్న మెగా హీరో..!
కేడీసీసీబీ చైర్మ‌న్‌గా బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి..?
జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీస్ అట్ట‌ర్ ఫ్లాప్‌..!
బుట్టా రేణుక‌కు ఎమ్మెల్సీ..?
స‌ల్మాన్ ఖాన్ ప‌రువు తీసిన దీపికా..!
ఆ కథను పూరి ఎందుకు ఇలా చేస్తున్నాడు..
విజయ్ బిగిల్ రింగ్.. విజిల్ వేయిస్తుందా..
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING