సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన స్వగ్రామం చింతమడకలో పర్యటించారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య శోభారాణి, కుమారుడు కేటీఆర్‌ ఇతర కుటుంబ సభ్యులు స్వగ్రామం వెళ్లారు. తన పర్యటన వేళ.. స్వగ్రామం వాసులకు భారీ కానుక ప్రకటించారు.


ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల విలువైన సాయం చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. చింతమడకకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. మూడు, నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు.


గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు. వైద్యానికి కావాల్సిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందట. సొంత గ్రామంపై కేసీఆర్ ప్రేమను మెచ్చుకోవాల్సిందే. చాలా మంది నాయకులు తమ గ్రామాలను ఏమాత్రం పట్టించుకోరు.


అయితే.. తెలంగాణలోని మిగిలిన గ్రామాల సంగతి ఏంటి.. కేసీఆర్ హయాంలో మిగిలిన గ్రామాలు కూడా చింతమడకలా మారితే బావుంటుంది. పల్లె తలరాత మారుస్తానంటున్న కేసీఆర్.. ప్రతి గ్రామాన్ని ఓ చింతమడకలా మార్చాలి. అప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: