ప్రభుత్వాలు మారినా, ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తున్న వారి మీది ప్రతాపం చూపడంలో మాత్రం సర్కారులో మార్పు ఉండదని కొత్తగా ప్రజలు ఎన్నుకున్న జగన్‌ ప్రభుత్వం నిరూపించింది. మధ్యాహ్న భోజనం అక్షయపాత్రకు అప్పగించవద్దని సోమవారం ఆందోళనకు దిగిన వంట అమ్మలను విజయవాడలో బలవంతంగా అదుపులో తీసుకున్నారు పోలీసులు.

మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర వంటి స్వచ్ఛంద సంస్థ కు అప్పగించకుండా, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ.. సోమవారం విజయవాడలోని ధర్నాచౌక లో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు.

'' మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ప్రభుత్వమే నిర్వహించాలని, కార్మికుల పెండింగ్‌ వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని...'' ఈ సందర్భంగా మధ్యాహ్న వంటశాల కార్మికులను ఉద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గపూర్‌ డిమాండ్‌ చేశారు.

నిరసన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. జగన్‌ ప్రభుత్వంలో కూడా మహిళా ఆందోళన కారులను అరెస్ట్‌ చేస్తారా .. అని అపుడే సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: