కర్ణాటక రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం బలపరీక్ష పూర్తి చేస్తానని స్పీకర్ రమేశ్ కుమార్ చెప్పిన వేళ.. రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈరోజు సభలో చర్చ అనంతరం బలపరీక్షకు సిద్ధం కావాలని కుమార స్వామిని స్పీకర్ కోరారు.


దీంతో బలపరీక్ష కోసం మరింత సమయం కావాలని సీఎం కుమార స్వామి కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష నిర్వహించాలని బిజెపి పట్టుపట్టింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు మాట్లాడుకుని బలపరీక్షపై నిర్ణయానికి రావాలని స్పీకర్ రమేశ్ కుమార్ సూచించారు.


తనకు స్పీకర్ కూడా సహకరించే పరిస్థితులు లేకపోవడంతో చివరకు కుమార స్వామి రాజీనామాకు సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆయన రాజీనామా చేయడం ఇక లాంఛనమే. గవర్నర్ ను కలసి రాజీనామా సమర్పించాలని కుమార స్వామి నిర్ణయించుకున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: