కేశినేని నాని గత రెండు నెలలుగా సంచలన ట్విట్లు చేస్తున్నారు. పార్టీకి అధికారం పోయిందన్న బాధలో కేశినేని నాని చంద్రబాబుని పలు రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. వారి పార్టీ వారితోనే ట్విట్టర్ వేధికగా యుద్దాలు చేసుకొని పరువు తీసుకున్నాడు. ఒకానొక సమయంలో పార్టీని విడుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. 


అయితే ఏమైందో ఏమో మరి. వారం రోజుల నుంచి వారి పార్టీ వారిని కాకుండా పాలకపక్ష నేతలపై పడ్డారు. మొన్నటికి మొన్న విజయవాడలో రోడ్లు బాగుచేయించండి అని ట్విట్ చేశారు, నిన్న ఏమో అతను, చంద్రబాబు, గళ్ళ జయ్ దేవ్ ఉన్న ఫోటోను ట్విట్ చేస్తూ 'మేము ముగ్గురం చాలు' అంటూ ట్విట్ చేశారు. 


ఈరోజు మిథున్ రెడ్డి శభాష్ అంటూ ట్విట్ చేశారు. నాని ట్విట్ చేస్తూ 'శభాష్ మిథున్ రెడ్డి గారు @MithunReddyYSRC @ysjagan ప్రత్యేక హోదా సాధించే బాధ్యత మీదే అని ఒప్పుకున్నందుకు  మిమల్ని అభినందిస్తున్నాను. ప్రత్యేక హోదా సాధిస్తే మిమ్మల్ని రాష్ట్ర నడి బొడ్డులో సన్మానం చేస్తాం. సాధించలేకపోతే మీరేమి చేస్తారో కొంచం చెప్పగలరు.' అంటూ ట్విట్ చేసాడు. ఈ ట్విట్ కి ఇంకా మిథున్ రెడ్డి స్పందించకపోయినప్పటికీ నెటిజన్లు మాత్రం కామెంట్ బాక్స్ బద్దలు కొడుతున్నారు. 'ప్రత్యేక హోదా రాదు అని ఎందుకు అంటారు, పాలకపక్షానికి సహకరించి హోదా వచ్చేలా చెయ్యచ్చు కదా' అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు.    



మరింత సమాచారం తెలుసుకోండి: