ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్ పై వింత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనాతీరును చంద్రయాన్ 2 ప్రయోగానికి ముడిపెడుతూ విచిత్రమైన విమర్శలు చేస్తున్నారు. చంద్రయాన్ 2 కి వెయ్యి కోట్లు ఎందుకు అనే మనస్తత్వం జగన్ ది అంటూ తాజాగా విమర్శలు గుప్పించారు.


చంద్రయాన్ లోను అవినీతి జరిగిందని జగన్ మాట్లాడినా ఆశ్చర్యం లేదంటూ చంద్రబాబు జగన్ పై సెటైర్లు వేశారు. వైసీపీ కి ఉన్న అవినీతి ముద్రను పదే పదే తెలుగుదేశం మీద రుద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఈ ప్రయత్నం లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.


వైసీపీ తప్పుడు ఫిర్యాదుల వల్లే ప్రపంచ బ్యాంకు వివరణాత్మక దర్యాప్తుకు వస్తామని చెప్పిందని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఫిర్యాదుల కారణంగానే ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లిందని అన్నారు. ప్రాజెక్టు పై ఆసక్తి లేదనే సంకేతాలు వైసీపీ సర్కారు స్పష్టంగా ప్రపంచ బ్యాంకు కు ఇచ్చిందని ఆరోపించారు.


వైసీపీ వచ్చాక ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తానందంటూ తప్పుడు సమాచారం తో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ వాస్తవాలు వక్రీకరించి రాజకీయ లబ్ది పొందాలనుకుంటారని చంద్రబాబు మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: