ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త చర్యలు వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి.చంద్రబాబునాయుడు ఎప్పుడూ ఏమంటారు, దానికి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానమిస్తారు అని గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు అక్రమాలు చేశారు అనేటువంటి ఆరోపణల్లో ఉన్నటువంటి వైసిపి పార్టీ ఏ రకమైనటువంటి ఆరోపణలు బయటకు తీస్తుంది,ఇలా ఆసక్తికర అంశాలతో అసంబ్లీ ఎప్పటికప్పుడు నడుస్తోంది.

అయితే రెండు రోజులు సెలవు తరువాత అంటే గత శుక్రవారం నడిచినటువంటి నుండి అసెంబ్లీ మళ్లీ ఇవాళ్ళ అంటే సోమవారం ఓపెన్ అవుతుంది. ఈ సోమవారం అసెంబ్లీ మధ్యలో రెండు రోజుల గడువు వచ్చింది,ఈ గడువుకు ముందు నారా లోకేష్ ఒక విశ్వరూపాన్ని ఎమ్మెల్సీ చైర్  లోనే కాకుండా ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ వాళ్ళ యొక్క కోపాన్ని ఉగ్రరూపాన్ని కూడా చూశాం. విద్యుత్ చెల్లింపుల దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు అనేక అంశాల మీద జగన్మోహనరెడ్డి ఆరోపణ చేస్తున్నారు తప్ప ఆయన దగ్గర ప్రూఫులు లేవు అనేది చంద్రబాబు టిడిపి యొక్క ప్రధాన వాదన.

అయితే బిజెపి చంద్రబాబు వైపు చూస్తున్నట్టు వంటి ఈ తరుణంలో సోమవారం ఉదయం చంద్రబాబు అసెంబ్లీ బయల్దేరుతూంటే కేంద్ర నుంచి ఎవ్వరూ ఊహించని ఒక వ్యక్తి వచ్చి అర్జెంటుగా కలిశాడని ఇది సెన్సేషన్ కే  సెన్సేషన్ అని అంటున్నారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు ఘాటుగా రంజుగా సాగుతుంటే, ఈ టైంలో అంత హడావుడిగా ఎవరొచ్చారు చంద్రబాబును కలవడానికి ఎవరు సిద్ధమవుతున్నారు.రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిరుగుతుందో అనుకుంటూన్నటువంటి ఈ అంశమేంటి ?

వివరాళ్లోకి వెళ్తే  నారా చంద్రబాబునాయుడు ఒక బిజినరీ లీడర్ అని అందరికీ తెలిసిందే ఈ మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనడం కంటే ముందే బెంగుళూర్, పూణే ,కలకత్తా ముంబయి లాంటి మహానగరాల్లోని మీడియా సైతం ఆంధ్రప్రదేశ్ లో  జరుగుతున్నటువంటి గడిచిన ఇరవై ఏళ్ల అభివృద్ధి కి చంద్రబాబు ప్రత్యక్షంగా పరోక్షంగా తన యొక్క పాత్ర పోషించారని ఎప్పుడూ చెప్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబులాంటి లీడర్ ని నమ్ముకోవాలి తప్ప ఏపీలో మరెవరూ చెంగు కొంగో పట్టుకోవాల్సిన అవసరం లేదని ఫీలింగ్ లో బీజేపీ స్పష్టంగా ఉంది.

ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా అప్పటి ప్రధాన మంత్రి వాజ్ పాయి దగ్గరనుంచీ మొన్నటి ప్రధాన మంత్రి మోడీ ఇప్పటికీ హోంమంత్రి గా ఉన్నటువంటి అమిత్ షా వరకు అందరితో మంచి సఖ్యత గా ఉన్నటువంటి చంద్రబాబునాయుడు గడిచిన రెండు వేల పధ్ధెనిమిదిలో ఊహించని రీతిలో ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే లోంచి బిజెపిని ఎదిరిస్తూ బయటకొచ్చిన సంగతి తెలిసిందే ఆ తరువాత ఆయన్ని ఇబ్బంది పడటానికి ప్రయత్నం చేసింది బిజెపి పార్టీ. అయినా ఎక్కడా ఆయన మాత్రం ఎక్కడా తొణకలేదు బెణక లేదు. రెండోసారి గెలుపు తథ్యం అనుకున్నారు కానీ ఆ విషయంలో మాత్రం ఫెయిలయ్యారు ఊహించని విధంగా నూట యాభై ఒక్క సీట్లతో జగన్ మోహన్ రెడ్డి గెల్చుకున్నారు.

అయితే ఈ పరిస్థితుల్లో పరిస్థితి ముందుకెళ్తుంటే బిజెపి మాత్రం చంద్రబాబుతో రాయబారానికి వీలైనంత మంది పెద్దవాళ్లే పంపిస్తోందట. చంద్రబాబుకి మోడీకి ఇద్దరికీ అత్యంతగా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి కేంద్రం నుంచి హుటాహుటిన సోమవారం ఉదయం దిగారని అసెంబ్లీతో పాటు అనేక చోట్ల జగన్ కు సంబంధించినటువంటి అంశాల్లో చంద్రబాబు ఏదైనా వ్యతిరేకంగా పోరాడితే బిజెపి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుందని అటువంటి ఫీలింగ్ ని వాళ్లొచ్చి మరి  ఈయనకి మాటిచ్చి  వెళ్లారని తెలుస్తోంది. ఈ సెన్సేషనల్ న్యూస్ నడుమ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: