ఏపీ మాజీ సీఎం చంద్రబాబుఅవినీతిని బట్టబయలు చేయాలని సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పీపీఏల పై సమీక్ష, పోలవరం, అమరావతి టెండర్ల విషయంలో రీ టెండర్లు, కరకట్ట నివాసాలు.. ఇవన్నీ అందులో ప్రయత్నంగానే జరుగుతున్నాయి. అయితే వీటిలో ఇప్పటి వరకూ చంద్రబాబును ఇరుకునపెట్టే రేంజ్ లో ఆధారాలు లభించినట్టు తెలియరాలేదు.


ఈ విచారణలపై పూర్తి నివేదికల వస్తే గానీ.. చంద్రబాబు అవినీతి గురించి సరైన ఆధారాలు లభించే ఛాన్సు లేదు. ఈ లోపే చంద్రబాబు ఇరుకున పెట్టాలని భావిస్తున్న జగన్ అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. పోలవరం అవినీతిపై కేంద్రంతో దర్యాప్తు చేయించాలని విజయసాయిరెడ్డితో రాజ్యసభలో విజ్ఞప్తి చేయించారు.


రాజ్యస‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. పోల‌వ‌రం నిర్మాణంలో 2014 నుండి 2019 వ‌ర‌కూ చంద్ర‌బాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింద‌నీ.. దానిపై సిబిఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. అయితే ఈ కోరికను కేంద్రం మన్నించలేదు. కేంద్రమంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ వివ‌ర‌ణ ఇస్తూ పోల‌వ‌రం నిర్మాణంలో అవినీతి జ‌రిగిన‌ట్టుగా ఇంత‌వ‌ర‌కూ త‌మ‌కు ఎటువంటి ఫిర్యాదులు అంద‌లేద‌న్నారు.


అందుక‌ని సిబిఐ విచార‌ణ అవ‌స‌రం లేద‌ని చెప్పేసారు. కేంద్రమంత్రి షెకావ‌త్ అలా స్పందించడం వైసీపీని అసంతృప్తికి గురి చేసింది. ఈ పరిణామంతో మాజీ సీఎం చంద్రబాబు మాత్రం ఖుషీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: