తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకరు చేసే మంచి పనులు మరొకరికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో వీరి ప్రత్యర్థులు అవతరి రాష్ట్రం సీఎంను ఉదాహరణగా చూపుతూ విమర్శిస్తున్నారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, పెన్షన్లు తదితర అంశాలలో జగన్ ఎలా వ్యవహరిస్తున్నారో గమనించాలని ఆయన కెసిఆర్ కు సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల పుణ్యమా అని పాత లబ్ధిదారులందరికి పెన్షన్లు పెరిగాయన్నారు.


ఏపీలో జగన్ లక్షల కొద్దీ ఉద్యోగాలు ఇస్తుంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం గడిచిన ఐదు సంవత్సరాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదని జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో చెప్పిన నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయలేదని ఆయన జీవన్ రెడ్డి గుర్తు చేశారు.


లోటు బడ్జెట్‌ ఉన్న ఏపీ కూడా ఉద్యోగులకు 27 శాతం పీఆర్‌సీ ఇచ్చిందని.. కేసీఆర్ మాత్రం వెనుకాడుతున్నారని అన్నారు. రుణమాఫీపైనా కేసీఆర్ ఇంతవరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: