ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్న రోజులు ఇవి,కాలం మారుతుంది, టెక్నాలజీ పరంగా దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుంది కానీ మూఢనమ్మకాలు,మనుషుల ఆలోచనలో మార్పురావడం లేదు.ఆడపిల్ల పుడుతుంది అని తెలిస్తే చాలు పూరిట్లోనే ఆడపిల్ల గొంతు నొక్కేస్తున్నారు.

ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పడానికి కొన్ని ప్రాంతాలు అలాగే ఉన్నాయి. ఆడపిల్ల పుడుతుంది అని తెలుసుకోవడం,అమ్మ కడుపులోని బిడ్డని చంపేయ్యడం.ఉత్తరాఖండ్ లో ఉత్తరకాశి జిల్లాలో 132 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మూడు నెలల కాలంలో 216 ప్రసవాలు జరగగా.... ఒక్క ఆడబిడ్డ కూడా పుట్టలేదు.

ఆడబిడ్డ అని తెలియగానే తల్లి గర్భంలోనే పిల్లల్ని చంపేస్తున్నారు అనే  అనుమానం అధికారులకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రామాలను రెడ్ జోన్ గా ప్రకటించింది ప్రభుత్వం. ఆరు నెలల పాటు పరిశీలించనున్నారు అధికారులు.

ఇప్పటికే దేశ జనాభాలో అమ్మాయిల ,ఆడవారి సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది వెయ్యి మంది మగవారు ఉంటే 647 మంది ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే, దేశంలో ఆడవారి సంఖ్య విపరీతంగా పడి పోయి దేశాభివృద్ధి ఆగిపోతుంది అని అధికారులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: