అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని చేస్తామని మాజీ సీఎం చంద్రబాబు చెప్పేవారు.. అందుకు అనుగుణంగానే ఆయన హాడావిడి చేశారు. చాలా దేశాలు తిరిగారు. సింగపూర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.


లండన్ లోని ప్రఖ్యాత కంపెనీతో డిజైన్లు గీయించారు. గ్రాఫిక్సులతో భవిష్యత్ అమరావతిని కళ్లకు కట్టారు. అయితే అసలు వాస్తవం వేరేలా ఉందట. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆచరణలో అనేక ప్రాజెక్టుల విషయంలో ఒక్క శాతం పురోగతి కూడా సాదించలేదట.


తాజాగా వెలువడిన ఓ రిపోర్టు చెబుతున్న నగ్న సత్యం ఇది. పది ప్రాజెక్టులలో ఏభై శాతం పనులు జరిగాయట. మరో ఇరవై ఒక్క ప్రాజెక్టుల విషయంలో సున్నా నుంచి ఒక శాతం పనులు మాత్రమే జరిగాయట. మొత్తం 35847 కోట్ల రూపాయల విలువైన టెండర్లను ప్రభుత్వం పిలిచింది.


ఇందులో ఎమ్మెల్యేల, అధికారుల నివాస సముదాయం, యాక్సిస్ రోడ్డు, జ్యూడిషియల్ కాంప్లెక్స్ వంటి వాటి పనులే కొంత వరకూ జరిగాయట. దాదాపు 12 వేల కోట్ల రూపాయల పనుల్లో ఒక్క అడుగు కూడా పడలేదట. కనీసం నిధులు కూడా కేటాయించలేదట. ఇదీ చంద్రబాబు సర్కారు అమరావతి కోసం చేసిన కృషి.


మరింత సమాచారం తెలుసుకోండి: