అటవీ హక్కుల పరిరక్షణ, 1927 అటవీ చట్ట సవరణలపై గిరిపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 లక్షల మంది ఆదివాసులు, ఇతర అటవీ అధికార  ప్రజలను జులై 24 నాటికీ గెంటివేయాలన్న తన ఫిబ్రవరి 13 నాటి ఆదేశం పై, సుప్రీం కోర్ట్ తానే స్టే ఇచ్చినప్పటికీ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీన్ని బట్టి  ఆదివాసులు తొలగింపు ముప్పు తొలిగిపోలేదని అర్ధమవుతోంది. 


తరతరాలుగా అడవులలో నివశిస్తున్న ఏ ఒక్క ఆదివాసిని వారి వారి ఆవాసాల నుంచి, కొండపోళ్ల నుంచి తొలగించరాదని, ఆదివాసుల హక్కులను హరించడానికి 1927 అటవీ చట్టానికి సవరణల పేర మరో చట్టం చేయాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించాలని, కొండపోళ్లు పట్టాలు కొండపోడులు చేసిన వారందరికీ ఇవ్వాలని, వి.ఎస్.ఎస్ ల కింద ఉన్న పట్టాలను గ్రామ సభల ఉమ్మడి  పట్టాలుగా చేయాలనీ  ఏజన్సీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


 తూర్పుగోదావరి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసులతో రైతు కూలి సంగం (ఆంధ్రప్రదేశ్), దాని అనుబంధ ఏజెన్సీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అటవీ హక్కుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనీ , సుప్రీం కోర్ట్ లో ఆదివాసులకు వ్యతిరేకంగా ఏ రకపు ఆదేశాలు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫారెస్టు అధికారులు ఇటీవల కాలంలో గంగవరం మండలం మర్రిపాలెం, యందవల్లి తదితర చోట్ల, రంపచోడవరం మండలం డబ్బావాలాస, వెట్టిచెల్కల తదితర గ్రామాల్లో ఆదివాసులు పెంచుతున్న జీడిమామిడి చెట్లను నాశనం చేయడానికి ప్రయత్నించారని వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: