అమరావతి నిర్మాణంపై కొత్త సీఎం జగన్ వైఖరితో అక్కడ రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నదా.. అమరావతి చుట్టుపక్కల భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదా.. ఇక ముందు కూడా అమరావతి కోలుకునే అవకాశాలు లేవా..?


తెలుగుదేశం నేతలు చెబుతున్న మాటలు వింటుంటే.. అదే నిజం అనిపిస్తోంది. అమరావతి నిర్మాణాన్ని వైసీపీ మొదటి రోజు నుంచి వ్యతిరేకించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


“ రైతులను భూములు ఇవ్వొద్దని రెచ్చగొట్టినా 99శాతం మంది ఇచ్చారు.. ప్రపంచ బ్యాంకు కు వరుస ఫిర్యాదు లేఖలు రాసింది వైసీపీ నేతలే.. ప్రపంచ బ్యాంకు వెనక్కి పోవటానికి పూర్తి కారణం వైసీపీనే.. పర్యావరణ, ఆర్ధిక, సామాజిక రంగాలపై ప్రభావం ఉంటుందని అమరావతి పై దుష్ప్రచారం చేశారు”“ దాదాపు 2లక్షల కోట్ల రూపాయల ఆస్తి అమరావతి భూములది.. వైసీపీ వల్ల భూముల విలువ బాగా పడిపోయింది.. ముళ్ల తుంప తప్ప మరేదీ లేదని మంత్రులే చెప్పటం వల్ల రాజధాని కి ఏవీ రాకుండా చేస్తున్నారు... మంద బలం ఉంది కదా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు “.


“ రాజధాని వైసీపీ సొంత జాగీరు కాదు.. వాంపిక్, లేపాక్షి తరహాలో ఈనాడు అమరావతిని చేయలనుకుంటున్నారు.. ఒక వ్యక్తి చేతకాని తనంతో ఈ విధంగా రాష్టాన్ని తయారు చేస్తుంటే... ఒక ప్రతిపక్ష నాయకుడిలా చూస్తూ కూర్చోను.. ఇక్కడ నుండి పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి... ప్రపంచం మొత్తం గొప్పగా చర్చించుకున్న అమరావతి ని వైకాపా తీరుతో చెడుగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది..విశాఖపట్నం నుంచి అమరావతి కి రావాలంటే..., హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి అమరావతికి వచ్చే పరిస్థితి తెచ్చారు.. అన్నారు చంద్రబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: