తాజాగా జగన్ అధికారుల మీద సీరియస్ అయ్యారని న్యూస్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లను "అన్న" అని పిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన జగన్ మోహన్ రెడ్డి, మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో చాలా అసహనంతో ఉన్నారని, కోపంతో ఫైల్స్ టేబుల్ మీద విరిసికొట్టి వెళ్లిపోయాడనే వార్తలు ఇప్పుడు అధికార వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


సీఎం జగన్ అధికారుల పనితీరు మీద చాలా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అంతగా అధికారుల మీద జగన్ కోపం గా ఉండడానికి కారణం ఏంటంటే సీఎం జగన్ చెప్పిన పనిని అధికారులు చేయలేదని తెలుస్తుంది.  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ అయిన నవరత్నాల అమలు కోసం సీఎం జగన్ తెగ తాపత్రయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి నవరత్నాల అమలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.


అధికారులు అలా చెప్పడానికి కారణం నిధులు లేకపోవటమే, నిధుల లేమితోనే నవరత్నాల అమలు చేయలేమని చెప్తే , ఎలాగైనా సాధ్యమయ్యేలా చూడమని అధికారులకు జగన్ చెప్పారు. ఇక అధికారులు సీఎం చెప్పింది ఆచరణ సాధ్యం కాదని చెప్పినట్లుగా సమాచారం. జగన్ అధికారంలోకి రావటానికి దోహదం చేసినవి "నవరత్నాలు". వాటిని ఎట్టి పరిస్థితుల్లో నూ అమలుచేయాలనే ఒకే ఒక లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాటికి సరిపడినంత బడ్జెట్ అనేది అందుబాటులో లేదనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: