108 ఉద్యోగులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. . స‌మస్య‌లుంటే ప్రభుత్వం తో చ‌ర్చించాలి.. ఇలా స‌మ్మెకు దిగ‌టం ఏంటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అయితే ప్ర‌ధానంగా త‌మ‌కు రావాల్సిన వేతన బ‌కాయిల‌ను చెల్లించాల‌ని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్త‌ంగా ప‌ని చేస్తున్న 108 ఉద్యోగుల‌కు ఒక్కొక్క‌రికి దాదాపు 70 వేల నుండి 80 వేల వ‌ర‌కు రావాల్సి ఉంద‌ని చెబుతున్నారు.


అన్ని 108 వాహ‌నాల్లో ఎమెర్జెన్సీ మెడిక‌ల్ టెక్నీషియ‌న్లు..పైలెట్లు ప‌ని చేస్త‌న్నారు. వీరంద‌రికీ 108 స‌ర్వీసు ప్రొవైడ‌ర్‌గా ఉన్న జీవీకే సంస్థ నుండి జీతాలు రావాల్సి ఉంది. దీని గురించి జీవీకే ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వ హాయంలో దీని పైన ఎన్నిసార్లు నివేదించినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత కూడా త‌మ సమ‌స్య ప‌రిష్కారం కావ‌టం లేదంటూ మెరుపు స‌మ్మెకు దిగాల్సి వ‌చ్చింద‌ని ఉద్యోగులు వివ‌ర‌ణ ఇస్తున్నారు.


తాము ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో త‌మ స‌మస్య‌ల‌ను నివేదిస్తే..ఖ‌చ్చితంగా ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని..అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు. 108 ఉద్యోగులు ముంద‌స్తు స‌మాచారం..సంప్ర‌దింపులు లేకుండా మెరుపు స‌మ్మెకు దిగ‌టం పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఉద్యోగులు మెరుపు స‌మ్మెకు దిగ‌టం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: