అనుభ‌వం ఉన్న నాయ‌కుడికి పాల‌న ప‌గ్గాలు అందిస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని భావించిన రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నివ్వెర పోయే విష‌యం ఇది! టీడీపీ పాల‌న‌లో అవినీతి, ఆక్ర‌మాల‌కు అద్దం ప‌ట్టే మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది. దాదాపు రూ.100 కోట్ల‌కు పైగానే టీడీపీ త‌మ్ముళ్లు ప్ర‌జాధ‌నాన్ని దోచేసిన ఉదంతం వెలుగు చూసింది. విష‌యాంలోకి వెళ్లే.. రాష్ట్రంలోని అన్న‌దాత‌ల‌కు గ‌త ప్ర‌భుత్వం 2017-18, 2018-19 సంవ‌త్స‌రాల్లో `రైతు ర‌థం ప‌థ‌కం` కిండ స‌బ్సిబీపై ట్రాక్ట‌ర్లు పంపిణీ చేసింది. 


ఒక్కో  ట్రాక్ట‌ర్‌కు రూ. రెండు ల‌క్ష‌ల నుంచి రూ. రెండున్న‌ర ల‌క్ష‌ల వ‌ర‌కు స‌బ్సిడీ ఇచ్చింది.  ఈ ప‌థ‌కం  కింద రేండేళ్ల‌లో స‌మారు రూ.400 కోట్లు ఖ‌ర్చు చేసినట్టు  ప‌లు సంద‌ర్భాల్లో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గా ఇన్‌చార్జిలు, ఎంపీలు సిఫార‌సు లేఖ‌లు ఆధారంగా వీటిని పంపిణీ చేయ‌డంతో అవ‌నీతి తాండ‌వించినందున‌ తాజాగా ఆధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్రభుత్వం నిగ్గుతేల్చింది.


బినామీ పేర్ల‌తో పంపిణీ :
ప్ర‌ధానంగా అప్ప‌ట్లో అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల పేర్ల‌తో వీటిని అంద‌జేశారు.  ఆయా గ్రామాలో అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు రైతు ర‌థం సిఫార్సు లేఖ ఎమ్మెల్యేల నుంచి అందుకుని పెద్ద రైతుల‌కు వీటిని పంపిణీ చేశారు. ప్ర‌ధానంగా ట్రాక్ట‌ర్ల కంపెనీల సిబ్బంది, డిస్ట్రిబ్యూట‌ర్లు ల‌బ్ధిదారుల ఫోటోల‌ను చూపించి స‌బ్సిడీ సొమ్ము జ‌మ చేయించుకున్నారు. కొంత మంది ట్రాక్ట‌ర్ల కంపెనీలు మ‌జ‌మానులు, డీల‌ర్లు  అధికార పార్టీ శాస‌న‌స‌భ్యుల వ‌ద్ద‌కు త‌మ అనుచ‌రుల‌ను తీసుకెళ్లి లేఖ‌లు అందుకున్న సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ట్రాక్ట‌ర్‌తో పాటు రోటోవేట‌ర్‌, 25 వీల్ డ్రైవ్‌ ఉంటే రూ. రెండు ల‌క్ష‌లు, దీంతో పాటు 4వీల్ డ్రైవ్ అయితే రూ. రెండున్న‌ర ల‌క్ష‌లు స‌బ్సిడీగా ఇచ్చారు. ఆయా గ్రామాల్లో శాస‌న‌స‌భ స‌భ్యుల ముఖ్య అనుచ‌రులు లేఖ‌లు తీసుకుని ఇత‌ర రైతుల వ‌ద్ద రూ. ల‌క్ష వ‌ర‌కు తీసుకుని చేతులు దులుపుకున్నారు.


అసాముల‌కు అంద‌లం :
గ్రామాల్లో ప‌ది ఎక‌రాలు ఉన్న రైతు ట్రాక్ట‌ర్ కొనాల‌నుకుంటే.. రైతుర‌థం ప‌ధ‌కాన్ని అడ్డుపెట్టుకుని దీని ద్వారా ల‌బ్ది పొందారు. గ్రామాల్లో పార్టీ నేత‌లు, ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు, ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు ఈ లేఖ‌లు అందుకున్నారు. ఎమ్మెల్యేల లేఖ‌ల‌ను ఇత‌ర రైతుల‌కు అమ్ముకున్నారు. ఈ విధంగా రైతు ర‌థం ట్రక్ట‌ర్ల పంపిణీలో అంతులేని అవినీతి జ‌రిగింది. అదే స‌మయంలో రైతుర‌థం ట్రాక్ట‌ర్ల‌లో వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌కు ఒక్కో ట్రాక్ట‌ర్‌కు రూ. 50వేల వ‌ర‌కు ముట్టిన‌ట్లు స‌మాచారం. అప్ప‌ట్లో కేవ‌లం అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల జేబులు నింప‌డానికే రైతు ర‌థాలు తెర‌పైకి వ‌చ్చాయ‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు దుమ్మెత్తిపోశారు. ప్ర‌స్తుతం వైసీపీ గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన ప‌థ‌కాల‌పై దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌పై క్యాబినెట్ స‌బ్ క‌మిటీలు నియ‌మించారు. జిల్లాల వారీగా ఇప్ప‌టికే రైతుర‌థం ట్రాక్ట‌ర్ల పంపిణీపై ప్రాధ‌మిక నివేదిక తెప్పించినట్లు తెలిసింది.


అక్ర‌మాలు ఎన్నెన్నో...
ట్రాక్ట‌ర్ల ముందు ల‌బ్ధిదారుల‌ను నింపే ఫోలోల‌తో స‌రిపెట్టారు. రైతుర‌థం  ల‌బ్ధిదారులు వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌కు రూ. 5 వేల చోప్పున ప్ర‌సాదంగా పంపిణీ చేశారు. ఈ విష‌యంపై స‌మాచారం అందుకున్న ప్ర‌భుత్వం క్యాబినెట్ స‌బ్ క‌మిటీ ద‌ర్యాప్తు చేయాల‌ని నిర్ణ‌యించింది. రైతుల పేర్ల‌తో బినామీలు జేబులు నింపుకున్నార‌ని, ద‌ర్యాప్తు పూర్త‌యిన త‌రువాత దీనిలో అధికారులు, ఉద్యోగుల పాత్ర ఉంటే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, నిధుల‌ను రిక‌వ‌రీ చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ విష‌యం టీడీపీని బోనెక్కించ‌క త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: