సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నందున ముగ్గురు టిడిపి ఎంఎల్ఏలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎంఎల్ఏలను సస్పెండ్ చేయటం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి కావటం గమనార్హం. బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుండి టిడిపి ఎంఎల్ఏలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు గోల చేస్తునే ఉన్నారు.

 

అంశం ఏదైనా సరే సభా కార్యక్రమాలు సజావుగా సాగుకుండా అడ్డుకోవాలన్నదే వీళ్ళ ప్రయత్నంగా అర్ధమైపోతోంది. తాజాగా కొన్ని వర్గాలకు 45 ఏళ్ళకే ఫించన్ అనే అంశంపై సభ మొదలైనదగ్గర నుండి పై ముగ్గురు సభ్యులు గోల చేస్తునే ఉన్నారు. అందుకే వీళ్ళని అసెంబ్లీ సెషన్ అయిపోయేంత వరకూ సస్పెండ్ చేయాలన్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ప్రతిపాదనతో స్పీకర్ సస్పెండ్ చేశారు.

 

వీళ్ళ ప్లాన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ ప్రభుత్వం తరపున ఏమి చెబుతున్నా జనాలకు అర్ధం కాకూడదు. అదే చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నపుడు మాత్రం ఏమీ మాట్లాడరు. ఇక్కడే వీళ్ళ ఉద్దేశ్యం అర్ధమైపోతోంది.  చివరకు స్పీకర్ తో కూడా ప్రతీ చిన్న విషయానికి వాదన పడుతునే ఉన్నారు. దాంతో వేరే దారిలోకే స్పీకర్ వాళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: