ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ నేడు జరిగింది.  సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి పై సస్పెన్షన్ వేటు ఉంది.

అయితే వారిని సభా సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్‌ విప్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

వైకపా పార్టీ నాయకులు తీసుకొచ్చిన వీడియోలను చూపించిన స్పీకర్, తాము తీసుకొచ్చిన వాటిని చూపించాలని డిమాండ్ చేశామని టీడీపీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ  బలహీనవర్గానికి చెందిన తాను, ఉప నాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీల విస్మరణ గురించి అడిగాననే సస్పెండ్ చేశారన్నారు.

తన స్థానం నుంచి కదల్లేదని, అసభ్యంగా మాట్లాడలేదని అలాంటి తనను కావాలనే సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు.  ఇరు పక్షాల వీడియోలు చూసిన అనంతరం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారంటే దానిని కూడా వినలేదన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: