టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రజావ్యతిరేక పనుల గురించి నివేదిక ఇచ్చారు. సెక్రటేరియట్ కూల్చివేతపై ఫిర్యాదు చేశారు.


బ్రహ్మాండంగా ఉన్న సెక్రటేరియట్ ను కూల్చి కొత్తగా కట్టాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని విబేధిస్తున్న వివేక్.. తెలంగాణ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని.. దాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణ గవర్నర్ ద్వారా ఈ అధికార దుర్వినియోగాన్ని నియంత్రించాలని కోరారు.


తెలంగాణలోని అనేక రంగాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందని.. సెక్రటేరియట్, అసెంబ్లీ నిర్మాణాల కోసం వెచ్చించే ఆ ధనాన్ని ప్రజల సౌకర్యార్థం ఇతర కార్యక్రమాల కోసం వినియోగించేలా చూడాలని మాజీ ఎంపీ వివేక్ విజ్ఞప్తి చేశారు. వివేక్ బీజేపీలో చేరతారని అంతా అనుకున్నా.. చివరకు విజ్ఞప్తి పత్రం ఇవ్వడం వరకే పరిమితం కావడం ఏంటన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: