రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఎ) నెలవారీ నిర్వహణ మొత్తం 7,500 రూపాయలకు మించి ఉంటే 18 శాతం జిఎస్‌టిని చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

ఆర్‌డబ్ల్యుఎలు సభ్యుల నుండి వసూలు చేసే రుసుముపై జిఎస్‌టి వసూలు చేయాలి, అటువంటి చెల్లింపు నెలకు ఫ్లాట్‌కు రూ .7,500 కంటే ఎక్కువ మరియు ఆర్‌డబ్ల్యుఎ వార్షిక టర్నోవర్ రూ .20 లక్షలకు మించి ఉంటేనే జిఎస్‌టి వర్తిస్తుంది . ఆర్‌డబ్ల్యుఎ సభ్యునికి నెలకు రూ .7,500 మించకపోతే జీఎస్టీ ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.


"నిర్వహణ ఛార్జీలు సభ్యునికి నెలకు 7,500 రూపాయలు దాటితే,  మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు, నిర్వహణ ఛార్జీలు (మైంటనెన్స్) సభ్యునికి నెలకు 9,000 రూపాయలు అయితే, జిఎస్టి  18 శాతం మొత్తం రూ .9,000 చెల్లించాలి. అంతే  కానీ  (రూ. 9,000-రూ. 7,500) = రూ 1,500  మీద  కాదు, " అని తెలిపింది.

"ఉదాహరణకు, ఒక వ్యక్తి రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో రెండు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లను కలిగి ఉంటే మరియు ప్రతి అపార్ట్‌మెంట్ నిర్వహణకు మైంటనెన్స్ ఛార్జీలుగా నెలకు రూ .15 వేలు ఆర్‌డబ్ల్యుఎ కి చెల్లిస్తే (ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి నెలకు రూ. 7500 / -), మినహాయింపు ప్రతి  ఫ్లాట్ జిఎస్టి పైన ఉంటుంది "అని ఇది తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: