ఆంధ్ర అసెంబ్లీలో టీడీపీ నేతలపై మొదటిసారి వేటు వేసింది కొత్త ప్రభుత్వం. సభ సమయాన్ని వృధా చేస్తూ వస్తున్నారని బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుపై స్పీకర్‌ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అసెంబ్లీ సీజన్ ముగిసే వరుకు సభకు రావొద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. ప్రతిపక్షం నుంచి ముగ్గురు నాయకులపై సస్పెన్షన్ వేటు పడగా ఇప్పుడు కేవలం 20 మంది మాత్రమే సభలో ఉన్నారు. 


అయితే ఈ సస్పెన్షన్ వేటుపై తెలుగుదేశం పార్టీ అధినేత పుత్రరత్నం మాజీ మంత్రి, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా స్పందించారు. ట్విట్టర్ లో ఒక టీడీపీ నాయకుడిని సభ నుంచి బయటకు పంపే చిత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే.. రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కి నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.   


కొందరు నెటిజన్లు నారా లోకేష్ పై సెటైర్స్ వేస్తే మరి కొందరు ఎమ్మెల్యేని ఆలా ఎలా తీసుకెళ్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కొందరు నెటిజన్లు మాత్రం స్పందిస్తూ 'చంద్రన్న హయాంలో ఉన్నప్పుడు విద్యార్థుల పరిస్థితి ఇది అంటూ, ఫోటోని జత చేసి కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు జగన్ ప్రజాసంకల్ప యాత్రలో చేసిన హామీలను గుర్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: