రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతు వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారికి ఆర్ధిక భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనిలో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీల మేరకు వైఎస్సార్ పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.

దీనిని ఈ ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేసేందుకు జీవో 62 ను జారీ చేశారు. దీనిలో భాగంగా రైతు పై భారం పడకుండా ప్రభుత్వమే పంటలకు బీమా ప్రీమియంలు చెల్లించేలా ఆదేశాలను జారీచేశారు. దీనిద్వారా ప్రకృతి వైపిరిత్యాలకు, తుఫానులు వల్ల నష్టపోయిన రైతులకు  రాష్ట్ర ప్రభుత్వమే బీమా అందించనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేయడంతో రైతులందరూ హర్షం వ్యక్తం  చేస్తున్నారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులంతా వ్యవసాయ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతంలో రైతులు వేసే పంటలకు ప్రధానమంత్రి ఫేసర్ బీమా ద్వారా పత్తికి రూ.1850, మిర్చికి రూ.3150, కందిపప్పుకి రూ.300 , వరికి రూ.600 రైతులు ప్రీమియం చెల్లించేవారు. అయితే ఇప్పుడు రైతులు రూ.1 చెల్లిస్తుండగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విదంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: