అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ప్రవర్తన రోజు రోజుకు  మరీ నేలబారుకు దిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అంగీకరించటానికి చంద్రబాబుకు అహం అడ్డువస్తున్నట్లే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జనాలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియా ఏమాత్రం అంగీకరించలేకపోతున్నారు.

 

ఆ విషయం అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా బయటపడిపోతోంది. మాటకు ముందు జగన్ కు పాలనలో అనుభవం లేదని, జగన్ కు విజన్ లేదని, అరాచక పాలన చేస్తున్నారని, తాను సలహాలు ఇస్తున్న తీసుకోవటం లేదని ఇలా..నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏపిని దెబ్బకొట్టి తెలంగాణా అభివృద్దికి పాటుపడుతున్నారంటూ అడ్డదిడ్డమైన ఆరోపణలు, విమర్శలతో జగన్ పై మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

చంద్రబాబు చెప్పినవన్నీ నిజమే అయితే జగన్ కు వచ్చే ఎన్నికల్లో జనాలే బుద్ధి చెబుతారు. అంత వరకూ ఓపికపడితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబే సిఎం కావచ్చు కదా ? ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు ? ఎందుకంటే, అర్జంటుగా జగన్ ను సిఎం కుర్చీలో నుండి దింపేయాలన్నదే చంద్రబాబు ఆలోచన. కానీ అది సాధ్యంకాదు.

 

అందుకే వీలైనంతలో జగన్ పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న కారణాలను కూడా బూతద్దంలో చూపుతు అసెంబ్లీ సమావేశాలు జరగకుండా నానా యాగీ చేస్తున్నారు. అసెంబ్లీలో తాజాగా  జరిగిందదే. 2017లో పెన్షన్ల విషయంలో సాక్షి మీడియాలో వచ్చిన ఓ వార్తను పట్టుకుని గోల చేస్తున్నారు. 2018లో తన బహిరంగ సభలో చేసిన ప్రకటనను, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లే తాము పెన్షన్లను పెంచుతున్నామని జగన్ ఎంత చెప్పినా చంద్రబాబు అండ్ కో వినటం లేదు. చంద్రబాబు ప్రవర్తన మరీ ఇంత చవకబారుగా దిగిపోతుందని ఎవరూ ఊహించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: