సినీరంగంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఇక ఫ్యాన్స్ సెంటిమెంట్లకూ లెక్కే ఉండదు. సినీనటీనటులకు తెలుగు, తమిళంలో ఉన్నంత ఫ్యాన్స్ క్రేజ్ వేరే ఏ భాషలోనూ ఉండకపోవచ్చు.


ఆ క్రేజ్, పిచ్చి ఏ రేంజ్ లో ఉంటాయంటే.. ఈ ఫ్యాన్స్ ఏకంగా ఆ స్టార్స్ నే బెదిరిస్తుంటారు. అయితే అదంతా అభిమానంతోనే అనుకోండి. అలాంటిదే ఈ తమాషా సంఘటన. ఇది ఈనాటిది కాదులెండి. ఓ పాతికేళ్ల నాటి విషయం.


అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులకు బాలయ్య నటిస్తున్న టాప్ హీరో సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి. మంజుల కూడా ఇంట్రస్ట్ గా ఓకే చెప్పేశారు. ఈ విషయం పత్రికల్లో వచ్చేసింది.


కానీ ఈ వార్త ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ కూ పెద్దగా పడేది కాదట. దాంతో మంజుల బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించొద్దని ఫ్యాన్స్ గొడవ చేశారట.


నల్ల ముసుగులు వేసుకొని, పెట్రోల్‌ క్యానులు పట్టుకుని స్టూడియోకు వచ్చి తగలబెట్టుకుని చచ్చిపోతాం’ అని గొడవ చేశారు. చివరకు కృష్ణ.. మంజుల నటించడం లేదని ప్రకటన ఇచ్చేవరకూ ఫ్యాన్స్ ఒప్పుకోలేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: