కర్ణాటకలో విశ్వాస తీర్మానం రాజకీయం జీడిపాకం సీరియల్ లా సాగుతోంది. ఇదిగో.. ఈరోజే.. ఇప్పుడే తేల్చేస్తాం అంటూనే నాలుగైదు రోజులుగా సాగదీస్తున్నారు. ఇప్పుడు కుమార స్వామి ఇంకో వారం రోజులు టైమ్ అడుగుతున్నారు.


ఐతే.. ఇంతగా కుమార స్వామి ఎందుకు సాగతీస్తున్నారు. మేజిక్ ఫిగర్ ను సంపాదించే సంఖ్యాబలం లేదని తెలిసీ ఎందుకు గడువులు కోరుతున్నారు. ఎలాగూ ఊడిపోయే పదవి కోసం ఎందుకు పాకులాడుతున్నారు.. ఇందుకు వేరే కారణం ఉందట.


అదేంటంటే.. కుమారస్వామి జ్యోతిష్కంపై నమ్మకం ఎక్కువ. ఎలాగోలా బుధవారం వరకు ఈ డ్రామా కొనసాగిస్తే.. ఆ తర్వాత తిరుగు ఉండదని కొందరు జ్యోతిష్యులు చెప్పారట. అందుకే కుమారస్వామి ప్రతి రోజూ విశ్వాసపరీక్ష ఓటింగ్ జరగకుండా జాగ్రత్తపడున్నారట.


బుధవారం నుంచి కుమార స్వామికి గ్రహబలం బాగా ఉందట. అప్పటి వరకూ ఏదోలా సాగదీస్తూ పోవాలన్నది కుమారస్వామి ప్లాన్. అందుకే ఆయన పదేపదే స్పీకర్‌ను కలిసి వాయిదా కోరుతున్నారు. మరి కుమార స్వామికి బుధవారం వరకూ సమయం దొరుకుతుందా.. మంగళవారమే విశ్వాస పరీక్ష ఫినిష్ చేస్తానని స్పీకర్ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: