ఎన్నో కలలు.. ఎన్నో అసలు.. ఎలాగైనా కొన్ని సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పాలని చూసిన పవన్ కళ్యాణ్ ఆశలు అడుగంటిపోయాయి.  కేవలం ఒక్కసీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది.  కనీసం అధినేత పవన్ గెలవలేకపోయాడు.  దీంతో పవన్ తిరిగి సినిమాల్లోకి వస్తారని అందరు అనుకున్నారు. 


పవన్ మాత్రం రాజకీయాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టాడు.  ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయాల్లోనే ఉంటానని చెప్పాడు.  వైకాపా రాష్ట్రంలో బలంగా ఉన్నది.  ఈ సమయంలో ఒంటరిగా ఆ పార్టీని ఢీకొట్టే పరిస్థితి లేదు.  తెలుగుదేశం పార్టీ కూడా దారుణంగా పతనం అయ్యింది.  


ఆ పార్టీతో చేతులు కలపడం అసాధ్యం. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తోంది.  కేంద్రంలో ఎలాగో అధికారంలో ఉన్నది.  ఆంధ్రాలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న పార్టీలోకి ఎలాగైనా పవన్ ను తీసుకురావాలని చూస్తోంది.  2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చారు.  పార్టీ తరపున ప్రచారం చేశారు.  


2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, జనసేన పార్టీకి సపోర్ట్ అవసరం చాలా ఉన్నది.  పార్టీని ఆర్ధికంగా నిలబెట్టుకోవాలి అంటే జాతీయ పార్టీ సపోర్ట్ అవసరం.  ఒకవేళ పవన్ బీజేపీతో చేతులు కలిపితే.. పవన్ కు రాజ్యసభ మెంబర్ హోదాను ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.  మరి పవన్ బీజేపీతో చేతులు కలుపుతారు లేదా.. చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: