తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆలయ కమిటీ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికింది. గవర్నర్ బిశ్వభూషణ్  కుటుంబ సమీతంగా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి హజరయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు అధికారులు  ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త, నగర పాలక కమిషనర్ పి.ఎస్.గిరీషా, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు అయనను ఆహ్వానించారు. 

అనంతరం ఆయన శ్రీవారి ధర్షనం చేసుకొని, ఆలయ ఆధికారులతో సంభాషించారు. అధికారులు ఒకొక్కరుగా వచ్చి ఆయనను కలుసుకున్నారు. వారిలో తిరుపతి ఆర్.డి.ఓ.కనక నరసారెడ్డి, రేణిగుంట తహసీల్దార్ విజయసింహా రెడ్డి, సెట్విన్ సి.ఇ. ఓ. లక్ష్మీ, బీజేపీ నాయకుడు కోలాఆనంద్  ఘన స్వాగతం పలికారు. 

డీఎస్పీ లు  చంద్రశేఖర్,  సాయి గిరిధర్ ,  సిఐ అంజు యాదవ్, రెవెన్యూ డిటీలు ఈశ్వర్, శ్యాంప్రసాద్ , ఇతర అధికారులు ఆలయ ఏర్పాట్లు పర్వవేక్షించారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరారు. శ్రీవారిని దర్షించుకుని మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారి దర్షించుకుని 3.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి గన్నవరం బయలుదేరి వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: