కొత్తగా పెళ్లయిన అమ్మాయి నీళ్లోసుకుంటే ఆ ఇంట్లో హడావిడి అంతా ఇంతా కాదు. ఆ గర్భవతిని ఇంటిల్లపాది అపురూపంగా చూసుకుంటారు. బరువులు ఎత్తవద్దని.. పనులు చేయవద్దని తీయని ఆంక్షలు విధిస్తారు.


అయితే విదేశీ సుందరి ఎమీ జాక్సన్ మాత్రం.. అలాంటి రూల్స్ తనకు వర్తించవంటోంది. ఈ శ్వేత సుందరి ప్రస్తుతం గర్భవతి.. అయితే యోగా అంటే అమితంగా ఇష్టపడే ఎమీ జాక్సన్.. ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గనంటోంది.


ప్రెగ్నీన్సీతో రోజూ యోగా చేయాల్సిందేనని చెబుతోంది. అంతే కాదు.. యోగా చేస్తున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. యోగా చేయడం వల్ల చాలా లాభాలున్నాయని చెబుతోంది. అంతే కాదు ప్రెగ్నెన్సీతో ఉన్నవారు యోగా చేయడం వల్ల డెలివరీ సులభమవుతుందని తనకు వైద్యులు చెప్పారని అంటోంది.


గర్భవతులు కనీసం రోజులు 20 నిమిషాలైనా వాకింగ్ చేయాలని అమీ జాక్సన్ సలహా ఇస్తోంది. వైద్యుని సంప్రదించి తగిన వ్యాయామం చేస్తే లేబర్ కాంప్లికేషన్స్ తగ్గుతాయని చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: