టీడీపీ భవిష్యత్ నాయకుడు బాబుగారి ముద్దులు పుత్రుడు ట్విట్టర్ కూడా దొరికిపోవడం ఇప్పుడు ఇంకా కామెడీగా మారుతుంది. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా, తండ్రి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఉండనే ఉంది. దాని ద్వారా అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయలేకపోతున్నారు. మండలిలో లోకేష్ ఇంతవరకూ మైకు ముందు గర్జించిన దాఖలాలు లేవు. మాట్లాడిందే ఒకేసారి. అది కూడా బట్టి పట్టి చదివి వినిపించారు. అలా మమ అనిపించారు. ఇక ట్విటర్లో మాత్రం లోకేష్ కాగితపు పులిలా గాండ్రిస్తున్నారు.


అక్కడ ట్వీట్లలో చమత్కారాలు, వ్యంగ్యాలకు లోటు లేదు. తాజాగా అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావడంపై లోకేష్ ట్వీటేశారు. అచ్చెన్నాయుడును అసెంబ్లీ మార్షల్స్ పక్కకు తీసుకెళ్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. దానికో క్యాప్షన్ కూడా పెట్టారు. అయినా అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే గౌరవంగా బయటకు వెళ్లిపోవాలి! గతంలో రోజాను ఎమ్మెల్యేగా సస్పెండ్ చేస్తే ఆమె ఏడుస్తూ బయటకు వెళ్లిపోయారు.


తప్ప అసెంబ్లీలో అడ్డం కూర్చోలేదు. సస్పెన్షన్ తప్పు అనుకుంటే  వెళ్లి స్పీకర్ కు చెప్పుకోవాలి. ముందు అక్కడి నుంచి అయితే ఖాళీ చేయాలి. సస్పెన్షన్ తప్పు అయితే కోర్టుకు కూడా వెళ్లొచ్చు. అంతేకానీ.. సభలో రచ్చ చేయడం మాత్రం సబబు కాదు. ఈ ప్రాథమిక విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు లోకేష్. తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన రాద్ధాంతాన్ని ఇంకా అందంగా సమర్థించే ప్రయత్నం చేశారు. ఆఖరికి ట్విట్టర్లో కూడా ఇలా దొరికిపోతే ఎలా లోకేషూ!

మరింత సమాచారం తెలుసుకోండి: