తెలంగాణ క్యాడర్‌ లో ఉన్న బ్యూరోక్రాట్‌ శ్రీలక్ష్మిని ఏపీ కి పంపాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ కోరిన సంగతి తెలిసిందే...

ఐతే తెలంగాణ సర్కారు ఓకే చెప్పినప్పటికీ కేంద్రం నుండి అనుమతులు రాకపోవడంతో ఆ బదిలీ అలా ఆగిపోయింది. ఇదిలా ఉండగా,

మంగళవారం , సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి పార్లమెంటులో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. తెలుగు మీడియా అంతా ఆమె నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఐతే అనధికార వర్గాల సమాచారం ప్రకారం, పార్లమెంటులో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి తనను ఏపీకి డిప్యుటేషన్‌ పై పంపాలంటూ విజ్ఞప్తి చేశారని తెలిసింది.

ఆమె ఇప్పటికే సీఎం జగన్‌ ను కలిసి ఏపీలో పనిచేయడంపై ఆసక్తి చూపగా, జగన్‌ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి.

శ్రీలక్ష్మి గతంలో ఓబుళాపురం గనుల వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లొచ్చారు. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యంపాలైన ఆమె, ఈ కేసు నుంచి విముక్తురాలైన తర్వాత మళ్లీ విధుల్లో చేరిపోయారు.

శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణ క్యాడర్‌ లో పనిచేస్తున్నారు. తెలంగాణ క్యాడర్‌ లో ఉన్న ఆమె ఏపీకి రావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: