ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికాకు వెళ్ళనున్నారు. అక్కడ వారం రోజుల పాటు పర్యటిస్తారు. ఆగస్టు 17వ తేదీ నుంచి 23 వరకు జగన్ తన కుటుంబంతో పర్యటన ఉండనున్నట్టు సమాచారం. పర్యటనలో భాగంగా మిషిగన్-డెట్రాయిట్-కోబో కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్నారైలతో ఆయన సమావేశంకానున్నారు. సీఎంగా బాధ్యతలు  చేపట్టిన అనంతరం జగన్ వెళ్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.

పర్యటనకు సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా, జగన్‌ ఇటీవలే విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయంలో సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందారు. పాస్‌పోర్ట్ పొందిన తర్వాతే అమెరికా టూర్ ఖరారైంది. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో జగన్ పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత డల్లాస్‌లో జరిగే కేబెల్లే కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సభలో కూడ  జగన్ పాల్గొంటారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: