చంద్రబాబు గండర గండడు అంటారు. ఆయన రాజకీయం ఎపుడూ ముందు చూపుతో సాగుతుంది. ఏపీలో ఇపుడున్న వాతావరణంలో అనుకూల మీడియా సైతం  సీఎమ్ గా జగన్ నామస్మరణ చేయక తప్పని పరిస్థితి. దాంతో బాబు మీడియా మీటింగులు కూడా చాలా తక్కువ కవరేజ్ తో వస్తున్నాయి. ఇలా జరిగితే ఇబ్బందే మరి. 


దాంతో బాబు మాస్టర్ ప్లాన్ వేశారు. పైగా ఈ రోజు వైసీపీ సర్కార్ మూడు చారిత్రాత్మకమైన బిల్లులను సభలో పెడుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు నామినేటెడ్ పద్దతిలో కాంట్రాక్టులు ఇవ్వడం అంటే నిజంగా రికార్డే మరి. కాంట్రాక్టర్ అనగానే కనిపించేది మోతుబరి ఆసామి, అగ్రకులం వారే. మరి అందులో కూడా అణగారిన వారికి ఇవ్వడం అంటే జగన్ పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే మహిళలకు కూడా ఇందులో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారు.


ఈ బిల్లులు అసెంబ్లీలో చర్చకు వస్తున్నాయి. ఆ చర్చలో పాల్గొంటే కూడా టీడీపీని వైసీపీ నేతలు ఏకిపారేస్తారు. మీ సర్కార్ ఏం చేసిందని నిలదీస్తారు. దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బాబు గారు ఆలోచించారు. తమ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో రగడ చేయించి మరీ కధను  సస్పెన్షన్ వరకూ నడిపారు. అదేల అంటే ఏకంగా స్పీకర్ చైర్ దగ్గరకే వెళ్ళి టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన మైక్ కట్ చేయడం.


దీన్ని ఎవరూ సహించరు. దాంతో ఎలాగూ సస్పెన్షన్ వేటు వేశారు. జగన్ సీఎం అయ్యాక ఇలా చేశారు, మాపై సస్పెన్సన్లు పెట్టారు చూడండని టీడీపీ ఎమ్మెల్యేలు నానా యాగీ మీడియా ముందు చేశారు. ఇక ఆ తరువాత సభ నుంచి బాబు ఇతర ఎమ్మెల్యేలు వాకౌట్ కూడా చేశారు. మరింకేం అనుకూల మీడియాకు రేపటి హెడ్ లైన్స్ మసాలా దొరికేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: