గ్రామాలను దత్తత తీసుకోవడం ఇప్పటి వరకు చూశాం. ఇపుడ అడవిని దత్తత తీసుకున్న అరుదైన ముచ్చట ఇది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుండే తెరాస రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రకటించారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల నవీకరణలో భాగంగా కీసరగుట్ట అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును సొంత నిధులతో తీర్చిదిద్దుతాం అని సంతోష్‌ కుమార్‌ చెప్పారు.

త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలోకి వెళ్లి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం డెవలప్‌ చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు అద్భుతంగా ఉన్నాయి. పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకునేందుకు ఈ పార్కులు తోడ్పడుతాయి. వారాంతాల్లో కుటుంబంతో సహా సేదతీరే చక్కని ప్రాంతాలుగా పిల్లల్లో పర్యావరణం, అటవీ, జీవవైవిధ్యం ప్రాధాన్యతలు తెలుసుకునే ప్రాంతాలుగా అర్బన్‌ ప్రాంతాలను తీర్చిదిద్దుతాం అని ఆయన అన్నారు.

కేటీఆర్‌ బర్త్‌డే కానుక...

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా, ప్రభుత్వం అటవీశాఖ ద్వారా అమలు చేస్తున్న. కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని మంచి ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్ది హైదరాబాద్‌ వాసులకు బహుమతిగా ఇస్తాం అని సంతోష్‌ అంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా. ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని, కేటీఆర్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ నినాదాన్ని ఎంపీ సంతోష్‌ స్ఫూర్తిగా తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: