జీడిపాకంలా సాగుతున్న కర్ణాటక రాజకీయ నాటకం తుది అంకానికి చేరుకుంది. కొద్దిసేపట్లో సీఎంగా కుమార స్వామి కొనసాగుతారా.. రాజీనామా చేస్తారా అన్నది తేలిపోనుంది. మూడు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్నరాజకీయ డ్రామాకు ఎండ్ కార్డు పడిపోనుంది.


విశ్వాస తీర్మానంపై ప్రస్తుతం సీఎం కుమార స్వామి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. తనకు ప్రసంగించేందుకు మూడు గంటల సమయం కావాలని కుమార స్వామి కోరారు. త్వరగా ముగించాలని స్పీకర్ కోరారు.


కథ క్లైమాక్సు చేరుతుండటంతో బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. కుమార ప్రభుత్వం బలనిరూపణకు 103 సభ్యుల బలం అవసరం. కానీ అధికార పక్షానికి 99 మంది సభ్యుల బలమే ఉంది.


స్పీకర్‌, నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కలుపుకున్నా 101 మాత్రమే ఉంటుంది. కేవలం ఇరుపక్షాల బలం సమమైనప్పుడు మాత్రమే స్పీకర్ ఓటేస్తారు. దీన్నిబట్టి చూస్తే కుమార స్వామి రాజీనామా ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: