ఇప్పటి వరకు కర్ణాటక అసెంబ్లీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది.  సీఎం కుమార్ స్వామి పదవి ఉంటుందా..ఊడుతుందా అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.  నేడు బల నిరూపణ చేసుకోపోతే ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఇదిలా ఉంటే ఇప్పుడు బెంగళూరులో 144 సెక్షన్ కొనసాగుతుంది. 


విశ్వాస పరీక్షలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ ద్వారా ఆంక్షలు విధించారు. బల పరీక్ష నిరూపణలో భాగంగా సీఎం కుమారస్వామి ప్రస్తుతం విధాన సభలో ప్రసంగిస్తున్నారు.


తన ప్రసంగానికి 3 గంటల వ్యవధి కావాలని సీఎం కోరగా, త్వరగా ముగించాలని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ కోరారు. ఇదిలా ఉండగా ఓ అపార్టుమెంటులో గల ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కోసం అక్కడికి వెళ్ళిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: