పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలన్నది అభిమానుల కోరిక. అయితే పవన్ మాత్రం తాను రాజకీయాల్లోనే ఉంటానని, ఒక ఎన్నికతో అది కాదని, పాతికేళ్ల రాజకీయం చేయడానికి వచ్చానని పదే పదే చెప్పుకొచ్చారు. తాజాగా తానా సభల్లో సైతం పవన్ తన ముఖానికి ఇక రంగు వేసుకోవడం జరగదని పక్కా క్లారిటీగా చెప్పేశారు.


అయినా సరే పవన్ రా బాబు అంటూ సినిమా జనం పిలుస్తూనే ఉన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా ఇపుడు పవర్ స్టార్ ని రా రమ్మంటున్నారు. ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ పవన్ని ఉద్దేశించి తాను మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని విలువైన సూచన చేశారు.


రాజకీయాల్లో పవన్ పోరాటం ఆపనవసరం లేదని పరుచూరి అంటూ అదే సమయంలో ఆయన సినిమాలు కూడా వదిలిపెట్టాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. పవన్ ఈ విషయంలో తమిళనాడు దివంగత నేత ఎంజీ రామచంద్రన్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పవన్ పోరాటం ఆపకుండానే సినీ జీవితాన్ని కొనసాగించవచ్చునని గోపాలక్రిష్ణ చెప్పారు. మరి పవన్ ఈ సూచనను ఎలా తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: